Bashaa


Bashaa

Successful formula always going to be successful ...

తెలుగు లో సూపర్ హిట్స్ సినిమాలు నాలుగున్నాయి ...






అవి 1. సమరసింహా రెడ్డి 
2. సింహాద్రి
3. నరసింహ నాయుడు
 4. ఇంద్ర
ఈ నాలుగు కధ లకు మూలం తమిళనాడు లో హిట్ సంచలనం సృష్టించిన "బాషా" అనే రజని కాంత్ సినిమా నుండి పుట్టినవే ...
ఈ సినిమా "హమ్" అనే హిందీ సినిమా నుండి పుట్టింది ....

            --------Ok ---Coming point -------

Main points in all four movies compared to Bashaa” 

బాషా సినిమా తో పోల్చి - మిగిలిన నాలుగు సినిమాలు చూద్దాము.....


1.ఫస్ట్ హాఫ్ లో హీరో సామాన్యం గా జీవిస్తూ వుండాలి
- బాషా లో రజని కాంత్ ఆటో డ్రైవర్
- సమరసింహా రెడ్డి లో టాక్సీ డ్రైవర్, హోటల్ లో పనిచేసే వాడు
- సింహాద్రి లో పనివాడు
- నరసింహ నాయుడు లో నాట్యా చారుడు
- ఇంద్ర లో టూరిస్ట్ గైడ్
లొకేషన్స్ మారాయి .. వృత్తులు మారాయి ...

2. సామాన్య జీవితం గడిపే హీరో హింస కి చాల దూరం గా ఉంటాడు ... కోపాన్నంతా అణచుకొని ఉంటాడు ... ఫైట్ అవసరం పడినా ఫైట్ చేయడు .. (హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే డౌట్ రావాలి కదా ...)
- బాషా లో గొడవలు జరుగుతున్నాయంటే అటు వైపు రజని కాంత్ వెళ్ళడు ..
ఆటో ని పాడు చేస్తున్నా ఏమీ అనడు ..
- సమర సింహా రెడ్డి లో అంజలా జవేరి వచ్చి బాలయ్య ని రౌడీ లతో కొట్టిపిస్తున్నా ఎదురు తిరగడు ..
- సింహాద్రి లో "భూమిక" విషయం లో అవమానాలు ఎదుర్కొంటాడు
- నరసింహ నాయుడు లో కొడుకు గురించి వేరే వూరు వెళ్ళిపోతాడు .. ఫైట్ చేయడు .. ఎదురు తిరగడు ..
--- ఇంద్ర లో షౌకత్ ఆలీ ఖాన్ దగ్గర ఫైట్ అవసరం పడినా చేయడు ...

3. ఫస్ట్ హాఫ్ లో ఫైట్ కోసం ఒక క్యారెక్టర్ ని విలన్ గా వాడతారు ... వాడ్ని మెయిన్ విలన్ కి లింక్ కలుపుతారు ...
- బాషా లో ఇంద్రుడు క్యారెక్టర్
- సింహాద్రి లో రవిబాబు
- సమర సింహా రెడ్డి లో ఫస్ట్ ఫైట్
- నరసింహ నాయుడు లో ఫస్ట్ ఫైట్
- ఇంద్ర లో ఫస్ట్ ఫైట్

4. సామాన్యుడు గా వుండే హీరో ని చూసి ఒక పెద్ద వ్యక్తి షాక్ తిని, దండం పెట్టాలి ... లేదా ఫ్లాష్ బ్యాక్ చెప్పి బయ పెట్టాలి ..
-- బాషా లో పోలీస్ ఆఫీసర్ షాక్ తింటాడు .. మెడికల్ కాలేజీ సీట్ కోసం ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు ..
-- సమరసింహా రెడ్డి లో డి.జి.పి.. సత్యనారాయణ దణ్ణం పెడతాడు
-- నరసింహ నాయుడు లో బాలయ్య ట్రైన్ దిగగానే కొందరు పారిపోతారు
-- సింహాద్రి లో -.. నంబూద్రి "జూనియర్ ఎన్ టి ఆర్ ఫోటో తో తిరుగుతుంటాడు
-- ఇంద్ర లో గవర్నర్ ప్రకాష్ రాజ్ దణ్ణం పెట్టడం

5. హీరో ఎవరినీ ప్రేమించడు .. హీరో మీద ఫస్ట్ హీరోయిన్ మనసు పారేసుకుంటుంది .. పాటలు పాడుతుంది ...
- బాష లో నగ్మా - రజని మీద ప్రేమ పెంచుకుంటుంది ..
- సమరసింహా రెడ్డి లో బాలకృష్ణ ని సిమ్రాన్ ప్రేమిస్తుంది ..
- నరసింహ నాయుడు లో ప్రీతీ జింగాని ప్రేమిస్తుంది ..
--- సింహాద్రి ని అంకిత ప్రేమిస్తుంది ...
- ఇంద్ర లో సోనాలి బెంద్రే ప్రేమిస్తుంది ...

6. హీరోయిన్ లు ఇద్దరు వుంటే వాళ్ళల్లో ఒకరు పాజిటివ్ .. ఇంకొకరు నెగటివ్ ... చివరకు నెగటివ్ హీరోయిన్ కుడా మారిపోతుంది ...
- సమర సింహా రెడ్డి లో "అంజలా జవేరి" నెగటివ్ షేడ్ క్యారెక్టర్
- ఇంద్ర లో "ఆర్తి అగర్వాల్" నెగటివ్ షేడ్ క్యారెక్టర్
- సింహాద్రి లో భూమిక .. నెగటివ్ షేడ్ క్యారెక్టర్ ..
- నరసింహా నాయుడు లో ఎవరు లేరు ...

7. హీరో కి / ప్రేక్షకుడి కి తెలియని ఒక ట్విస్ట్ ఒకటి వుంటుంది .. (తెలివైన వాళ్ళ కు తెల్సిపోతుంది అనుకోండి) ...
-. సమరసింహా రెడ్డి లో బాలయ్య ఎం పి .. తనే ఒకర్ని అనుకోకుండా చంపుతాడు .. ఆ ప్లేస్ లోకి బాలయ్య వస్తాడు ...
- సింహాద్రి లో భూమిక ఎన్.టి. ఆర్ ని పొడవడమే పెద్ద ట్విస్ట్ .. (అందుకే అంత బాగా ఆడింది)
- ఇంద్ర లో - శివాజీ , ఇంద్ర మేన కోడలని పెళ్లి చేసుకుంటానని చెప్పి ... వెళ్ళిపోవడం ...

8. బాషా ఫ్లాష్ బ్యాక్ లో - రజని కాంత్ ఫ్రెండ్ చరణ్ రాజ్ (బాషా) చనిపోవడం తో .. రజని కోపం తో నలుగురుని చంపుతాడు .. దానితో బాషా గా మారతాడు .. కావాలని మారలేదు ... తన వాళ్ళని చంపిన కారణం తో రజని - బాషా గా మారాల్సి వస్తుంది .. (personal loss)
- ఇదే సింహాద్రి లోను వుంది .. తన వదినను చంపారు అనే కారణం తో సింహాద్రి కేరళలో కొందరిని చంపి - సింగమలై గా మారతాడు (personal loss)
--- సమర సింహా రెడ్డి లోను ... ఇంద్ర లోను ... నరసింహ నాయుడు లోను ఫ్లాష్ బ్యాక్ లలో పౌరుషం, త్యాగం, ప్రేమ, పగలు ఉండేలా చూసుకున్నారు..

9. త్యాగం, బాద్యత, క్షమ, ప్రతీకారం ... అన్నే కలసి వుంటాయి ..
అయితే హీరో కి త్యాగం, బాద్యత, క్షమ లక్షణాలు వుంటే .. విలన్ కి కేవలం పగ, ప్రతీకారం వుంటాయి ....
దానితో హీరో క్యారెక్టర్ ని ప్రేక్షకుడు బాగా ఇష్టపడతాడు ...
- బాషా లో రజని కి ఈ లక్షణాలు వుంటాయి ... అంథోని రఘువరన్ కి కేవలం పగ, ప్రతీకారం మాత్రమె వుంటాయి.
- సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర లో ను ఈ లక్షణాలు హీరో లలో కనిపిస్తాయి .. విలన్ లలో పగ, ప్రతీకారం మాత్రమే వుంటాయి ...

10. ప్రతి సినిమా లో "ఇచ్చిన మాట కు కట్టుబడి - హీరో ప్రవర్తిస్తుంటాడు .. సామాన్యం గా దూరం గా బ్రతుకుతూ ఉంటాడు ..
- బాషా లో తండ్రికిచ్చిన మాట కోసం
- సింహాద్రి లో నాజర్ చెప్పిన మాటే సింహాద్రి కి వేద వాక్కు
- నరసింహ నాయుడు లో తండ్రి విశ్వనాథ్ మాట మీదే బాలయ్య ఉంటాడు
- సమర సింహా రెడ్డి లో పని వాడు పృథ్వీ రాజ్ కోసం


11. సామాన్యం గా బ్రతికే హీరో ఫ్లాష్ బ్యాక్ లో అసామాన్యం గా వుండాలి ... ఆ ప్రాంతానికి దేవుడు లా వుండాలి .... అలాంటి ఇన్సిడెంట్స్, విలన్ క్యారెక్టర్ లు ... పరిస్తితులు కల్పించాలి ... అపుడు హీరో క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుంది ..
- ఈ అన్ని సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ లు అలాగే వుంటాయి ..

కొత్త సీన్ లు .. కొత్త సంఘటనలు .. కొత్త విలన్ లు ... వేరు వేరు ప్లేస్ లో ఫైట్ లు ..
 
                  --------------------------------

సరిగ్గా గమనించండి...........
సింహాద్రి = లక్ష్మి
అల్లరి ప్రియుడు = పెళ్లి సందడి
అంతం = సత్య
హనుమంతు = సింహా
మహర్షి = డర్ర్ = ఆర్య
అహనా పెళ్ళంట = డి.డి. ఎల్ = ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే
కుచ్ కుచ్ హోతా హాయ్ = సంతోషం
బాబీ = నువ్వు నేను
మరో చరిత్ర = కొత్త బంగారు లోకం
గుడుంబా శంకర్ = ఆట
హమ్ ఆప్కే హైన్ కౌన్ = నువ్వొస్తానంటే నేనొద్దంటానా
వివాహ బోజనంభు = మన్మధుడు

Final suggestion :

సినిమా ఇండస్ట్రీ లో టాలెంట్ వుండాలి ... డబ్బు చేసుకునే తెలివి తేటలు వుండాలి .. ఏ కధ నయినా మార్చుకుని కొత్తదనం తో తీస్తే ఎవరు ఏమి అనరు ... బాగుంటే చూస్తారు .. అంతే ... ఎవరో మేధావి గుర్తించాడని ప్రజలు హాల్ కి వెల్ల కుండా వుండరు ...

Only talent rules the Film Industry ...if your idea best, you  are the creator ,that idea may be inspired ,converted from the original ...here presentation of the idea is importanat ...


సింహాద్రి గురించి కాస్త వివరం గా తెలుసుకోవాలంటే......

0 comments:

Post a Comment